Header Banner

ఇక ఫేక్ ఆధార్ కార్డులకు చెక్! కేంద్రం నుండి సరికొత్త ఆధార్ యాప్!

  Wed Apr 09, 2025 09:05        Politics

ఈ మధ్యకాలంలో కొందరు ఆధార్ కార్డులను సైతం ఫేక్ చేయడం జరుగుతోంది. అలాగే ఆధార్ కార్డుల వినియోగం ద్వారా మరికొందరికి ప్రైవసీ, సెక్యూరిటీకి భంగం కలుగుతోంది.

 

ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ కుమారుడికి స్కూల్లో గాయాలు.. జగన్ ఏమన్నారంటే..?

 

ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సరికొత్త యాప్‌ను ప్రారంభించింది. ఆధార్ వివరాలను డిజిటల్‌గా పంచుకునే ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు గోప్యతను పెంపొందించడమే లక్ష్యంగా కేంద్రం.. ఈ కొత్త ఆధార్ ధృవీకరణ యాప్‌ను ముందుకు తీసుకొచ్చింది.

ఈ విషయాన్ని కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దీని ఫీచర్ల గురించి వివరిస్తూ.. ఇది వినియోగదారుడి నియంత్రణ, సౌలభ్యానికి ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ యాప్ బీటా వెర్షన్ టెస్టింగ్ దశలో ఉంది. ఫేస్ ID ప్రామాణికంగా, ఒరిజినల్ కార్డులు, ఫోటో కాపీలకు ఎలాంటి అవసరం లేకుండా చేస్తుంది.

ఈ సరికొత్త యాప్ ఆధార్ ధృవీకరణను UPI చెల్లింపుల మాదిరిగా సులభతరం చేయడంతో పాటు యూజర్లకు ఎలాంటి ఆటంకాలు లేని డిజిటల్ అటెంటికేషన్‌ను సులభతరం చేస్తుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కొత్త యాప్‌లో యూజర్లు QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వాళ్లకు అవసరమైన డేటాను మాత్రమే సురక్షితంగా పంచుకోవచ్చు. ఈ టెక్-ఫార్వర్డ్ విధానం గోప్యతను నిర్ధారిస్తుందని, స్కాన్ చేసిన జిరాక్స్ కాపీలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని కేంద్రం పేర్కొంది .

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీటీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #Aadhaar #DigitalIndia #UIDAI #GovTech #IndiaTech #TechForPrivacy #SecureIdentity #DigitalVerification #AadhaarApp #FaceIDVerification